చిత్తశుద్ధితో దరఖాస్తులను పరిశీలించి సమస్యను పరిష్కరించాలి
* అదనపు కలెక్టర్ రాంబాబు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని ప్రజలు చేసిన దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సోమవారం ఐడిఓసి సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి
నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కరించాలని ప్రజలు చేసిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు.
ప్రజావాణిలో వచ్చిన పిర్యాదులు కొన్ని ఇలా ఉన్నాయి. భద్రాచలం మండలానికి చెందిన నరందాసు క్రిష్ణమూర్తి తన కుమారుడు అఖిల్ 8వ తరగతి చదువుతున్నాడని,
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కుటుంబ ఆర్థిక పరిస్థితులు వల్ల కుమారుడిని చదివించుకోలేక
పోతున్నామని పాల్వంచ గురుకులంలో సీటు ఇప్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఆర్ సిఓకు ఎండార్స్ చేశారు.
టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన కల్తీ బొజ్జయ్య అనిశెట్టిపల్లి పంచాయతీ లక్ష్మీదేవిపల్లి
మండలం నందు 20 సంవత్సరాల నుండి 4 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నానని అటవీహక్కుల గుర్తింపు
పత్రాలు జారికి నిర్వహించిన సర్వేలో పోడు భూముల పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నానని తనకు పోడు పట్టాలు
రాలేదని పోడు పట్టా ఇప్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు కలెక్టరేట్ ఈ సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మండలం సన్యాసిబస్తీకి చెందిన
కె.మల్లేశ్వరికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని దరఖాస్తు చేసుకున్నామని తహసిల్దార్ కార్యాలయంకు వెళ్తే ఫైల్ మా దగ్గరకు రాలేదని చెప్తు
కాలయాపన చేస్తున్నారని విచారణ నిర్వహించి తనకు కళ్యాణ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన
దరఖాస్తును పరిశీలించిన ఆయన విచారణ నిర్వహించి నివేదిక అందచేయాలని తహసిల్దార్ కొత్తగూడెంకు ఎండార్స్
చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిఆర్డీఓ రవీంద్రనాధ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.