మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వ్యవహార శైలిపై మంత్రి హరీష్ రావు సీరియస్ అయినట్లు తెలిసింది. అంతేకాకుండా మంత్రి గడలను మందలించినట్లుగా సోమవారం సోషల్ మీడియాలో హల్ చల్ కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల, ఆదివారం కొత్తగూడెం పట్టణంలో పాదయాత్ర చేసి హడావుడి చేసిన నేపథ్యంలో చర్చకు
దారి తీసింది. గడపగడపకు గడల అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు పెద్ద ఎత్తున ఇవ్వడం జోర్దార్ గా హడావుడి చేసిన గడలపై కొంతమంది పై అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే మంత్రి గడలకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
మంత్రి హరీష్ రావు మందలించలేదు…
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం తనకు ఫోన్ చేసి మందలించినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని తనను ఏ విధంగా మందలించలేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కెసిఆర్ స్ఫూర్తి తో తాను సేవా కార్యక్రమాల్లో ముందుకే సాగుతానని స్పష్టం చేశారు.