UPDATES  

 మద్యం దుకాణాలు పారదర్శకంగా ఎంపిక: కలెక్టర్ ప్రియాంక

మద్యం దుకాణాలు పారదర్శకంగా ఎంపిక: కలెక్టర్ ప్రియాంక

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియ లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక తెలిపారు.
సోమవారం పాల్వంచ జెన్కో కాలనీలోని భద్రాద్రి ఆడిటోరియంలో జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 88 దుకాణాలు కేటాయింపుకు నిర్వహించిన లాటరీ ప్రక్రియలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల
మేరకు ఆబ్కారీ శాఖ ఆగస్టు 4 తేదీ నుండి
18వ తేదీ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 88 మద్యం దుకాణాలకు గాను 5057 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు దారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ అత్యంత భద్రత నడుమ, ప్రక్రియ ఆసాంతం వీడియో చేసినట్లు చెప్పారు. దరఖాస్తు దారులు వేక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ టివి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రద్దీ నియంత్రణకు ముందస్తుగా పాసులు జారీ చేసినట్లు చెప్పారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జిల్లా ఆబ్కారీ అధికారి జానయ్య, ఆబ్కారీ సిఐలు, ఎసైలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !