మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన భేష్ అని గోవా రాష్ట్ర శాసనసభ్యులు సంకల్ప అమౌంకర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఏరియాలో సోమవారం జరిగిన “ప్రభాస్ యోజన మేర మట్టి మేరా దేశ్” కార్యక్రమానికి గోవా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా దేశం గొప్పతనాన్ని ప్రపంచం ముందు
నిలబెట్టారని పేర్కొన్నారు. మన భారత సైన్యానికి వారికి కావలసిన ఆధునికమైన అన్ని సౌకర్యాలు సమకూర్చారని దేశంలో పేదలకు లక్షల ఇళ్లు నిర్మించారని రామజన్మ భూమి విషయాన్ని పరిష్కరించి అందరికీ ఆమోదయోగ్యంగా రామాలయం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుందని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవశ్యత గురించి వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగా కిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పేరు రావటం లేదని దీని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వివరించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్, నరేంద్రబాబు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు, మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు బైరి నిర్మల, జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిలు బడే రమేష్, లక్ష్మణ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు కేశవ సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు స్వప్న, ఎస్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.