మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
ప్రజా పిర్యాదులు, ప్రజా ప్రతినిధులు సిఫారసు లేఖలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా పిర్యాదులు, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిటిషన్లు పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ పిర్యాదులు రానున్న 15 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తదుపరి పెండింగ్ ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్రాజు, డిఆర్డీఓ రవీంద్రనాద్, అన్ని
శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.