కెసిఆర్ మహాశక్తి..
* ఆయన పాలనకు తిరుగులేదు
* సంక్షేమ పథకాలు అదుర్స్
* మళ్లీ కేసీఆర్ దే అధికారం
* కొద్ది రోజుల్లో బిఆర్ ఎస్ లో చేరుతా
* విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ( చిన్ని)
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు రకాల ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాను బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్లు కోనేరు సత్యనారాయణ(చిన్ని) తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా
భారతీయ జనతా పార్టీలో పనిచేసిన తాను
జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తనకు సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన విజయవంతంగా ముందుకు పోతుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కే సాధ్యమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో నాన్ లోకల్ వ్యక్తులు వచ్చి పోటీ చేస్తున్నారని, అలాంటి వారిని గెలవనీయోద్దని తాను ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అందుకే తాను బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానన్నారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షించారు. అనేక సంవత్సరాలుగా తనను బీఆర్ఎస్ పార్టీలోకి పిలిచినా వెళ్లలేదన్నారు. చాలామంది అధికారం కోసం కాంగ్రెస్ లోకి వెళ్లి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి పిలుపు మేరకు కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిశానని తెలిపారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 115 మందికి కేసీఆర్ టికెట్లు ఇవ్వడం నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే నాయకుడిగా నిరూపించుకున్నారని ప్రశంసించారు.
కేసీఆర్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సంబంధించిన సముచిత స్థానం ఇస్తానని కొత్తగూడెం ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో తన తండ్రి ద్వారా తనకున్న పరిచయాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బిజెపిలో ఉంటే కొన్ని వర్గాల ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తుందని బీఆర్ఎస్ లో ఉంటే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ దే అధికారం అని కోనేరు సత్యనారాయణ(చిన్ని) స్పష్టం చేశారు.