ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కార్మిక లోకం వ్యతిరేకించాలి
*చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ*
*మన్యం న్యూస్ గుండాల*: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తలపెట్టిన హైదరాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పోస్టర్ ను నాయకులు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులోకం పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసారపు వెంకన్న, పుష్పరాజు, కిరణ్, శ్రావణ్ లాలయ్య తదితరులు పాల్గొన్నారు
