*బీసీ బందు లబ్ధిదారుల ఆనంద హేళ
*చేతివృత్తులకు రూ లక్ష ఇచ్చిచేయూతగా నిలిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు*
*బీసీ బందు లబ్ధిదారులు
*మన్యం న్యూస్ గుండాల*: గుండాల మండలంలో బీసీ బందు వచ్చి బీసీల్లో ఆనందాన్ని తెచ్చింది. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా సోమవారం చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.మండలంలో మొత్తం 20 మందికి 20 లక్షల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అందించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ చేతి వృత్తులు చేసుకునే మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, పార్టీ నాయకులు అటికం నాగేశ్వరరావు, సూర్యనారాయణ
