ఎమ్మెల్యే మెచ్చా కు అభినందనలు వెల్లువ
మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 22: బిఆర్ఎస్ పార్టీ దళపతి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో, అశ్వారావుపేట బిఅర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు స్వగ్రామమైన తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో ఎమ్మెల్యే మెచ్చా ఇంటికి నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ నాయకులు మంగళవారం క్యూకట్టారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద కొలహలంగా మారింది. ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.ç
