ప్రభుత్వ విప్ రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిసిన మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుని ఆయన స్వగృహం కొర్నవల్లి గ్రామంలో కరకగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రిగా చూడటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తని కలుపుకొని పోయి అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,కరకగూడెం సర్పంచ్ ఊకె.రామనాథం, నాయకులు కొంపెల్లి పెద రామలింగం,ఎలిపెద్ది. శ్రీనివాసరెడ్డి, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,బుడగం.రాము పజల్,సలుగు.బిక్షపతి,తాటి. వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.
