వరద బాధితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ప్రభుత్వం వరద బాధితులకు వెంటనే ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి
*ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం
మన్యం న్యూస్ చర్ల;
చర్ల మండల కేంద్రంలో సర్వేనెంబర్117 భూమిలో జరుగుతున్న వరద బాధితుల ఇంటి జాగల పోరాట కేంద్రాన్ని ప్రజాపంతా పార్టీ నాయకత్వం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం మాట్లాడుతూ వరద బాధిత ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయమైందని ప్రభుత్వం ఈ వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములపై ప్రజలకు అధికారం ఉందని అన్నారు ఆక్రమణదారులకు సహకరించే అధికారులు ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఎందుకు సహకరించరు అని ప్రశ్నించారు. వరద బాధితులు చేస్తున్న పోరాటం పట్ల పోలీసుల అత్యుత్సాహాన్ని మానుకోవాలని అన్నారు. ప్రజలకు భూమిని ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం అధికారులు తేలుస్తారని అప్పటివరకు పోలీసుల ఈ విషయంలో జోక్యాన్ని తగ్గించుకోవాలని అన్నారు దేశంలో ఏ వ్యవస్థ అయినా ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఏర్పరచుకున్న తప్ప మరి వేరే కాదని అన్నారు పోలీసు వారు మా భూమి అని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి ఇంటి జాగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం విఫలం అవ్వడం వల్లనే ప్రజలు ఈ భూమిని ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్, పి డి ఎస్ యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రసాద్, వరద బాధిత పోరాట సంఘం అధ్యక్షులు బోడా సందీప్, కార్యదర్శి కొండా కౌశిక్, మునిగేల నాగరత్నం, నాగరాజు, పురిటి ప్రశాంతు, చిప్పనపల్లి శ్రీకళ, జక్కా వెంకటేశ్వర్లు, గంపల రమేషు, మైప రాజేష్, కొంగురు సత్యం, తదితరులు పాల్గొన్నారు.
..