UPDATES  

 ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు శుభాకాంక్షలు తెలిపిన మణుగూరు టిబిజికెయస్ నాయకులు

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు శుభాకాంక్షలు తెలిపిన మణుగూరు టిబిజికెయస్ నాయకులు

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 23

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను బుధవారం నాడు మణుగూరు ఏరియా టిబిజికెయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర్ రావు రేగా కాంతారావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కులం,మతం ప్రాంతం అని తేడా లేకుండా ఆన్ని వర్గాల ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందిస్తూ,ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు పొందడమే కాక నియోజక వర్గాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకపోతున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు టికెట్ ప్రకటించడం ఆయన చేస్తున్న ప్రజా సేవకు తగిన గుర్తింపు లభించిందని వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతి టిబిజికెయస్ కార్యకర్త కూడ ఒక సైనికుడిలా పని చేసి భారీ మెజారిటీతో రేగా కాంతారావు గెలుపు కోసం కృషి చేస్తామని వారు ప్రకటించారు.ఈ కార్యక్రమం కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవుఫ్, బ్రాంచి నాయకులు వీర. భద్రయ్య,కాపా శివాజి,యస్ వి యస్ ఎన్ వర్మ,అశోక్, రామారావు,నాగెల్లి,సురేష్, గుడిపుడి.కోటేశ్వరరావు,కలగూర శంకర్,హారి,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !