UPDATES  

 ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

 

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

మణుగూరు వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 23

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించారు.ఈ సందర్బంగా ఆసుపత్రిలో వార్డులను పరిశీలించి, చికిత్సలు పొందుతున్న వారిని విప్,రేగా కాంతారావు పరామర్శించారు.అనంతరం వారికి అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ, సీఎం కెసీఆర్ పరిపాలనలో ఏజన్సీ లోని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు ఎంతో మెరుగుపడుతున్నాయి వారు తెలిపారు.వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది అన్నారు.ఇందులో భాగంగా ఆసుపత్రులలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరిగింది అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న డెలివరీలు,ఓపి నే ఇందుకు నిదర్శనమని వారు తెలిపారు. భవిష్యత్తులో ఆస్పత్రిలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోర్షన్ నర్సింహారావు హాస్పిటల్ సూపరిండెంట్ రాం ప్రసాద్, డాక్టర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !