పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.. డాక్టర్ పుల్లారెడ్డి
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 23::
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్ పుల్లారెడ్డి సూచించారు. మండలంలోని రామచంద్రుని పేట గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి నీటి నిలువలు ఉన్న చోట సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం గ్రామంలోనే ఆశ్రమ పాఠశాల స్కూలు నందు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరుచుకోవాలని వీడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు నీటి ద్వారా, వచ్చే వ్యాధులను దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి వారికి డాక్టర్ వివరించారు. ఈ హెల్త్ క్యాంపులో 30 మందికి ఓపి పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిర్ధారణమైన వారికి ఉచితంగా మందులని అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ధర్మయ్య సూపర్వైజర్ సాగర్ ఏఎన్ఎం ఆశలు పాల్గొన్నారు.