తుంగారం గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య…..
మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు23: జీవితంపై విరక్తితో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మండలంలో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…. తుంగారం గ్రామానికి చెందిన ఆళ్ల మల్లేశ్వరరావు (35) గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులు తట్టుకొలేక ఇబ్బందులు పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డగా, గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మల్లేశ్వరరావు మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఎస్సై మాచినేని రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు మగ సంతానం కలరు .