అశ్వారావుపేటలో మహిళా ఓటర్లదే పైచేయి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 23: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈసారీ మహిళా ఓటర్లదే పైచేయి. గతంలో పలు ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితాలోనూ మహిళలే అధికంగా ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలిస్తే గతంలో ఉన్న ఓటర్ల కంటే ఈసారి 1832మంది ఓటర్లు అధికంగా ఉన్నారు. తాజా జాబితాలో అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు.