మట్టితో రహదారి నిర్మాణ మన్యం న్యూస్ వాజేడు. మండలంలో చింతూరు గ్రామపంచాయతీ కోరకల్ గ్రామంలో మట్టితో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో కురిసిన వర్షాలకు గ్రామాలలో రహదారులు ధ్వంసం కావడంతో ప్రజలకు, వాహనాదారులకు,రాకపోకలు కష్టతరంగా మారాయి, సర్పంచ్ తెల్లం బుల్లి చొరవతో గ్రామాలలో మట్టితో రహదారులు నిర్మాణాలు చేపట్టారనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
