మానవత్వం చాటుకున్న ఎస్ఐ: షాహిన
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఆగస్టు 23: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్ర పరిధిలోని తొట్టిపంపు గ్రామాన్ని బుధవారం ఎస్సై షాహినా సందర్శించారు.విధి నిర్వహణలో గ్రామాన్ని సందర్శిస్తుండగా అతి పేద కుటుంబమైన తాటి నీలిమ భర్త క్రిష్ణ దంపతులు చిన్న పిల్లలతో కలిసి కరెంటు లేకుండా చిన్న పూరిగుడిసెలో నివాసం ఉంటూ అవస్థలు పడుతూ ఉండగా వారిని చూసి చలించి సహృదయంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వారికి కరెంటు మీటర్ ఏర్పాటు చేయించి,ఒక సీలింగ్ ఫ్యాన్ ను అందజేశారు.విధి నిర్వహణలో వుంటూ మానవత్వం చాటుకుంటున్న ఎస్సై షాహినాను పలువురు మండల ప్రజలు అభినందిస్తున్నారు.