బాధిత కుటుంబాలకు 50 కేజీల బియ్యం వితరణ.
*రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతులమీదుగా పంపిణీ*
మన్యం న్యూస్ కరకగూడెం:రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు మెంతిని. సాగర్ ,షేక్ మహమ్మద్, కుటుంబాలకు ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా బాదిత కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షులు అన్వర్ పాషా కోపరేటివ్ డైరెక్టర్ రావుల కనకయ్య ట్రస్ట్ సభ్యులు చందా.హరికృష్ణ, నాయకులు బుడగం.రాము,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
