అశ్వారావుపేట శాసనసభ్యులు
మెచ్చా నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ మండల నాయకులు
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి, ఆగస్టు 23 :2023 అసెంబ్లీ ఎన్నికలలో అశ్వారావుపేట బిఆర్ఎస్ అభ్యర్ధిగా మెచ్చా నాగేశ్వరరావును ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వగృహమైన తాటి సుబ్బన్నగుడెం గ్రామంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ మండల నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశ్వారావుపేటతో పాటు ఉమ్మడి జిల్లాలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో 10 స్థానాలు బిఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు ఎంపీటీసీ కృష్ణారెడ్డి,వేముల హరీష్,నేరెళ్ళ లాలయ్య,కట్టా శివ,బోయినపల్లి సుబ్బారావు,మారుతి రాములు,నున్నాగోపాలరావు,షేక్ బుడెన్,సున్నం ప్రసాద్,హరి కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.