ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల పాత్రికేయులు.
మన్యం న్యూస్ ,కరకగూడెం: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుని కరకగూడెం మండలం పాత్రికేయులు ఆయన స్వగ్రామమైన కొర్నవల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తొలత పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఇల్లందుల.సురేష్,బుడగం ప్రవీణ్,దుర్గం. ప్రేమ్ కుమార్,జాడి విజయ్,యాకన్న,బురుగడ్డ.వెంకట్ పాత్రికేయులు పాల్గొన్నారు.
