కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న జారే
మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఆగస్టు, 23: అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కోరుతూ అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు దరఖాస్తు పత్రమును పొంగులేటి వర్గీయులు పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి, మొవ్వ విజయ్ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య మరియు ఐదు మండలాల నుండి ముఖ్య నాయకులు జూపల్లి రమేష్, జూపల్లి ప్రమోద్, అల్లాడి రామారావు, చెన్నారావు, నారా వెంకట్, కక్కిరాల రమేష్, జూపల్లి ఉపేంద్ర, నాయుడు శ్రీను, కొంపటి వేణు తదితర పలువురు నాయకులు కార్యకర్తలు సమక్షంలో గాంధీభవంలో దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.