భాజపాను సంస్థ గత నిర్మాణం చేపడుతాం
కర్ణాటక ఎమ్మెల్సీ ప్రతాప్ సింహానాయక్
మన్యం న్యూస్ ,నూగురు వెంకటాపురం: భద్రాచలం నియోజకవర్గం లో భాజపాను సమస్త గత నిర్మాణం చేపడతామనికర్ణాటక ఎమ్మెల్సీ ప్రతాప్ సింహానాయక్ అన్నారు
వెంకటాపురం మండలం కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రతాప్ సీoహ నాయక్ హాజరయ్యారు. వారికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం కార్యక్రమంలో భాగంగా చొక్కాల వెంకటాపురం మార్కెట్ యార్డ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు అట్లూరి రఘురాం అధ్యక్షతన సభ ప్రారంభించారు. సభలో విచ్చేసిన ప్రతాప్ సింహ నాయక్ మాట్లాడుతూ, పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని రానున్న ఎన్నికలలో భద్రాచలం నియోజకవర్గంలొ భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఉన్నదని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, వారు తెలిపారు.దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం నియోజకవర్గం లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ గొల్ల కోటి త్రినాధరావు, రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు,సీనియర్ కార్యకర్త సంక వేమ సుందర్ సీనియర్ కార్యకర్త చెరుకూరి ప్రసాద్ పాల్గొన్నారు.
