*గోపయ్య కుటుంబాని కిరూ 5 వేల ఆర్థిక వితరణ అందజేసిన బీఆర్ఎస్ నేతలు*
*మన్యం న్యూస్ గుండాల*:మండల పరిధి గుండాల గ్రామపంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఈసం గోపయ్య రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మృతి చెందాడు .గోపయ్య దశదినకర్మకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు రూ5వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్య సమితి అధ్యక్షులు వీరస్వామి గోపయ్య కుటుంబానికి అందించారు. ఎన్నో ఏండ్లుగా గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల మరణించడం బాధాకరమని వారన్నారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, చరప వీరన్న, మోడెం కృష్ణ , గంగాధరి నాగన్న, గంగాధరి ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు
