చంద్రయాన్ విజయవంతంతో భారీ ర్యాలీ
మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా
వివేకవర్దని పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్ పాల్గొని విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు.విద్యార్థులు చిన్ననాటి నుండి శాస్త్ర సాంకేతిక రంగం వైపు వెళ్ళటానికి ఇటువంటి కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రపంచ దేశాల్లో భారత కీర్తి ప్రతిష్టలను పెంచిన శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకోవాలని రానున్న రోజుల్లో మీరు కూడా అటువంటి గొప్ప శాస్త్రవేత్తలు ఈ దేశానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వివేకవర్దని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమ్మ మహేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు, ఉపాధ్యాయులు షేక్ దస్తగిరి, కార్యదర్శి, శ్రీనగర్ కాలనీ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, ప్రభుత్వ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ప్రముఖ యోగా గురువులు గుమలాపురం. సత్యనారాయణ, సలీం, పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.