రెండో ఏఎన్ఎంలకు ఉద్యోగులు అండగా నిలవాలి
మన్యం న్యూస్. కొత్తగూడెం టౌన్: క్రమబద్దీకరణ ప్రధాన డిమాండుపై వైద్య శాఖలో పనిచేస్తున్న రెండో రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న సమ్మె పోరాటానికి ప్రభుత్వ శాఖల ఉద్యోగులు బాసటగా నిలవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. క్రమబద్దీకరణ, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ధర్నాచౌక్ నిరసన శిభిరం నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా నరాటి ప్రసాద్ మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తుంటే నామమాత్రంగా రెండు సార్లు చర్చలు జరిపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వి.మల్లికార్జున్, మెడికల్ ఉద్యోగులు రామ్ ప్రసాద్, నాగేశ్వరావు, సుశీల, ఆమనీ, రెండో ఏఎన్ఎంలు ఎండి. సజ్జుబేగం, బానోతు ప్రియాంక, కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.