- 31 నుంచి నేషనల్ హెల్త్ స్కీం ఉద్యోగుల సమ్మె
* జిల్లా అధికారులకు సమ్మెనోటీసు అందించిన నాయకులు
* కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
* ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమ్మె బాట : నరాటి ప్రసాద్
మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
నేషనల్ హెల్త్ స్కీంలో పనిచేస్తున్న సిబ్బంది నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, క్రమబద్దీకరణ హామీని అమలు చేయాలనీ హెల్త్ కార్డులు పిఎఫ్ భీమా వంటి సౌకర్యాలు కార్పించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది ఈ నెల 31 నుంచి నిరవధిక సమ్మెకు పూనుకోనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య శాఖ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్ కు సమ్మెనోటీసు డిమాండ్ నోటీసు అందించారు. అనంతరం కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ స్కీంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి పనిభద్రత కరువు అవుతుందన్నారు. యేండ్ల తరబడి ఊడిగం చేయడమే తప్ప సరైన వేతనాలు సౌకర్యాలు చట్టబద్ధ హక్కులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న నేషనల్ హెల్త్ స్కీం సిబ్బందిపట్ల కేంద్ర రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. వైద్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే సిబ్బంది సమ్మెబాట పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి నేషనల్ హెల్త్ స్కీం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వి.శ్రీనివాసరావు, సావిత్రి, కుంజా మాధవి, వీరన్న, పావని, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.