మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
రెండో ఏఎన్ఎంల క్రమబద్ధీకరణ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఏఐటియుసి నేతలు కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మంత్రిని కలిసిన నేతలు డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ప్రసాద్, జిల్లా కార్యదర్శి వి.మల్లికార్జున్, ఏఐటియుసి అనుబంద రెండో ఏఎన్ఎం యూనియన్ జిల్లా నాయకులు ఎండి.బేగం, బానోతు ప్రియాంక, కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.