UPDATES  

 పరిసరాల పరిశుభ్రత పాటించాలి మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ..

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 24: ఎవరికివారు తమ ఇంటి పరిసరాలను పరిసరాల పరిశుభ్రత పాటించాలని మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ గ్రామస్తులకు సూచించారు. గురువారం తిప్పనపల్లి పంచాయతీ, మహ్మద్ నగర్ గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి, రోగులను పరీక్షించారు. జ్వరపీడితుల నుండి రక్త నమూనాలు సైతం సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ తనూజ. మాట్లాడుతూ….ఇంటి పరిసరాల్లో మురుగునీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావలని, అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావున్నారు . దోమలు పుట్టకుండా, కుట్టకుండా దోమ తెరలు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !