మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుకు ఐదు సీట్లు గెలుచుకుంటామని
ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. గురువారం ఆయన కొత్తగూడెం శ్రీనగర్లోని కోనేరు సత్యనారాయణ(చిన్ని) నివాసానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాత మధు మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. కోనేరు సత్యనారాయణ బిఆర్ఎస్లో చేరడం పార్టీకి మరింత బలం పెరుగనుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రావి రాంబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు.