UPDATES  

 మోసగాళ్లు వస్తున్నారు… ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

మోసగాళ్లు వస్తున్నారు…
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
*సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పల్లెలు అభివృద్ధి
*గ్రామ గ్రామాన బీటి రోడ్ల నిర్మాణానికి కృషి
రూ8 కోట్ల 47 లక్షల 50 వేల తో నూతన బీటి రోడ్ల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్ అశ్వాపురం:మోసగాళ్లు వస్తున్నారు…
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలన్ని బాగుపడుతున్నాయి. మరో మారు కెసిఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు పిలుపునిచ్చారు. ఆయన గురువారం అశ్వాపురం మండలంలో విస్తృతంగా పర్యటించి 8 కోట్ల 47 లక్షల 50 వేల రూపాయలతో నూతన బీటి రోడ్ల పనులు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆడపడుచులు మంగళ హారతులతో ఆశీర్వదించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ అశ్వాపురం మండలం గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబాటుతనానికి గురైందని ప్రజలు తనకిచ్చిన అవకాశంతో మండలంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు .మండలంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రామాల వారీగా శంకుస్థాపన చేసిన రహదారుల వివరాలు
1.ఆనందపురం నుంచి నెల్లిపాక జడ్పీహెచ్‌ఎస్‌ వరకు సీడీ పనులతోపాటు కొత్త బీటీ రోడ్డు ఏర్పాటు
2.ఆర్ అండ్ బి రోడ్ శివలింగాపురం (మల్లెలమడుగు ఎస్టి కాలనీ) నుండి రేగా కాలనీ వరకు సిడి వర్క్‌లతో సహా కొత్త బిటి రహదారి ఏర్పాటు
3.బిజి కొత్తూరు నుండి నవోదయ స్కూల్ స్థలం వరకు సిడి పనులతో సహా కొత్త బిటి రోడ్డు ఏర్పాటు.
4.జగ్గారం నుండి వూకేవారి గుంపు వరకు సిడి పనులతో సహా కొత్త బిటి రోడ్డు ఏర్పాటు.
5.అశ్వాపురం నుంచి కొమ్ముగూడెం వరకు సీడీ పనులతోపాటు కొత్త బిటి రోడ్డు నిర్మాణం.
6.తుమ్మలచెర్వు నుంచి వెంకటాపురం కాలనీ వరకు సీడీ పనులతోపాటు కొత్త బిటి రోడ్డు ఏర్పాటు.
7.ఆర్ అండ్ బి రోడ్డు గొందిగూడెం నుండి ఆర్ అండ్ బి రోడ్డు గొల్లగూడెం వరకు సిడి పనులతో సహా కొత్త బిటి రోడ్డు ఏర్పాటు.
8.పిఆర్ రోడ్ అమెర్డా నుండి అంబేద్కర్ నగర్ వరకు సిడి పనులతో సహా కొత్త బిటి రోడ్డు నిర్మాణం.
9. ఆర్ అండ్ బి రోడ్డు నుండి సిడి మంచికంటినగర్ వరకుశంకుస్థాపన చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వాధికారులు,అధిక సంఖ్యలో మండల ప్రజలుతదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !