మన్యం న్యూస్,పినపాక: బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు పినపాక మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, ప్యాక్స్ గోపాలరావుపేట వార్డు డైరెక్టర్ కటకం గణేష్, బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సోంపల్లి తిరుపతిలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి జాబితాలో ఎమ్మెల్యే రేగాకు టికెట్ కేటాయించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రేగా కాంతారావు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి ఎనలేనిదని అన్నారు. పినపాక అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరో మారు ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలిపించుకోవాలనిఅన్నారు.
