అభాగ్యులకు ఆసరా అవ్వాలి.
కరకగూడెం ఎస్ఐ రాజారామ్
ఏజెన్సీలో ‘ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్’సేవలు అభినందనీయం వరద బాధితులకు బియ్యం పంపిణీ
మన్యం న్యూస్ కరకగూడెం: సమాజంలోని
అభాగ్యులకు ప్రతీ ఒక్కరూ ఎదో రూపంలో ఆసరా అవ్వాలని కరకగూడెం ఎస్ఐ రాజారామ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని నర్సంపేట ఎస్సీ కాలనీ,తాటిగూడెం గ్రామాలకు చెందిన వరద బాధితులకు వారి గ్రామాల్లో ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా సమక్షంలో ఎస్ఐ చేతుల మీదుగా సుమారు 50 కుటుంబాలకు 25 కేజీల చొప్పున 12.50 క్వింటాల
బియ్యంను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై రాజా రాం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవాగుణంను అలవర్చుకోని సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయంమని కొనియాడారు.ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
