మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
రామవరం 1/70 యాక్ట్ ప్రాంతములో గృహలక్ష్మి లబ్ది దారులను ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టాలని కోరుతూ గురువారం కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ సీతా లక్ష్మి
మంత్రి పువ్వాడకు వినతి పత్రం అందజేశారు.
గృహలక్ష్మి పథకం కొరకు కొత్తగూడెం రామవరం ఏరియా ప్రజలు కూడా దరఖాస్తు చేసుకున్నారని చైర్పర్సన్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ పథకం వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.