UPDATES  

 రెండు వేలమంది విద్యార్థులతో చంద్రయాన్-3 విజయోత్సవ ర్యాలీ

పాల్గొన్న మున్సిపల్ ఛైర్మెన్ డీవీ మన్యం న్యూస్,ఇల్లందు:చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 బుధవారం విజయవంతంగా ల్యాండ్ అవటంతో స్థానిక మార్గదర్శిని , సాహితీ విద్యాసంస్థల విద్యార్థులతో విజయోత్సవ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులచే ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కీర్తిస్తూ పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ ఆద్యంతం విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, యాజమాన్య బాధ్యులు మువ్వన్నెల జెండాలను చేబుని నినాదాలు చేస్తూ డీజే సౌండ్స్ మధ్య పట్టణమంతా 2 వేలమంది విద్యార్థులతో భారీర్యాలీ నిర్వహించారు. ముగింపు సమయంలో స్థానిక జగదాంబ సెంటర్ నందు మార్గదర్శిని పాఠశాల డైరెక్టర్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యాదగిరి రాంబాబు, అర్వపల్లి రాధాకృష్ణ మరియు సాహితీ కళాశాల డైరెక్టర్ మాదినేని శ్రీనివాస్, ప్రిన్సిపాల్స్ రాంబాబు., దామోదర్లు మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 విజయవంతంలో అహర్నిశలు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేవిధంగా కృషిచేశారని అన్నారు. ర్యాలీ పొడుగునా విద్యార్థినీ విద్యార్థులు ప్రజలకు మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శిని, సాహితీ విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !