UPDATES  

 పొదేం నీ అభివృద్ధి ఎక్కడ?

పొదేం నీ అభివృద్ధి ఎక్కడ?
*నిపుణుల కమిటీ అభ్యంతరాలతో కరకట్ట నిర్మాణ పనులలో జాప్యం
* డా.తెల్లని గెలిపిస్తే.. భద్రాచలంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది
* తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ కి కడుపు మంట: ఎమ్మెల్సీ తాత మధు
* విలేకరుల సమావేశంలో రేగా,తాత మధు
మన్యం న్యూస్, భద్రాచలం:
భద్రాచలం పట్టణంలోని హరిత టూరిజంలో హోటల్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , ఖమ్మం జిల్లా బీ. ఆర్.ఎస్ అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు…
ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచక అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు.
2200 కోట్లతో కరకట్ట నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేశారు. కానీ నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
కరకట్టలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ను గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తామని అన్నారు.
గత ప్రభుత్వాల కంటే గొప్పగా తాము అభివృద్ధి చేస్తున్నామని,
ఇంటింటికీ త్రాగు నీటిని అందిస్తున్నాము .
ఇప్పటి వరకు నీవు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి అని స్థానిక ఎమ్మెల్యే ని ప్రశ్నించారు .
రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భద్రాద్రి జిల్లాలో 5 స్థానాలు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు ..
ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ …

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ కి కడుపు మంటగా ఉందన్నారు. అధికార కార్యక్రమంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. కావాలని ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అధికారులు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేశారని, ఏదైనా పొరపాట్లు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోతే ఎలా అని, ఇది చాలా బాధాకరం అని ఎమ్మెల్యే ని ఉద్దేశించి మాట్లాడారు .
యాదాద్రి తరహాలోనే భద్రాద్రి ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో తెల్లం వెంకట్రావుని గెలిపించాలని కోరారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సహకారం తీసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కాలయాపన చేశారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం బీ.ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !