UPDATES  

 కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం

కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం
* మహిళా కూలీలతో కలిసి నాటు వేసిన రేణుక చౌదరి
* వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు యూరియా కట్టల పంపిణీ
*ఏజెన్సీ గుండాలలో విస్తృతంగా పర్యటించిన జాతీయ కాంగ్రెస్ సీనియర్ మహిళనేత ,మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి

మనం న్యూస్ గుండాల: కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యం అని జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళనేత ,మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి అన్నారు. ఆమె గురువారం గుండాల మండలంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆమె మహిళా కూలీలతో కలిసి నాటు వేయడం జరిగింది.అనంతరం వరద బాధితులకు ఒక్క కుటుంబానికి మూడు యూరియా కట్టాలను వితరణ ఆమె అందించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం నాయకులు విజయ్ గాంధీ, జిల్లా నాయకులు లక్కినేని సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యమాచారి, ఎంపీటీసీ కృష్ణారావు, నాయకులు ఈసం పాపారావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !