ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటన విజయవంతం చేయ్యండి
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి
మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు పెంచిన 4,016 రూపాయల పింఛన్ పెంపు పట్ల ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హర్షం వ్యక్తంచేసారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు దివ్యాంగులకు పెంచిన పింఛన్ పెంపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. 24వార్డ్ల కౌన్సిలర్లు, పట్టణ, మండల బీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
