UPDATES  

 తాళ్లూరితో ఎమ్మెల్సీ తాత మధు భేటీ… * బిఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం

తాళ్లూరితో ఎమ్మెల్సీ తాత మధు భేటీ…
* బిఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం

మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
సీనియర్ రాజకీయ నాయకుడు, బిఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు, భద్రాచలం సీతారామ చంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తాళ్లూరి వెంకటేశ్వరావుతో ఎమ్మెల్సీ తాత మధు భేటీ అయ్యారు. గురువారం ఎమ్మెల్సీ తాత మధు కోనేరు సత్యనారాయణ( చిన్ని) ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో తాళ్లూరి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తాళ్లూరితో తాతా మధు రాజకీయాలపై చర్చించడం జరిగింది. అంతేకాకుండా తాత మధు తాళ్లూరుని బిఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ ను తాళ్లూరు వెంకటేశ్వరరావు కల్వనున్నారు. తాత మధు తాళ్లూరిని కలవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు శ్రీనగర్ కాలనీ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్,
వార్డు సభ్యులు వొట్టికొండ సాంబశివరావు,
తెలంగాణ ఉద్యమకారులు న్యాయవాదులు కాటంరాజు, రవి విజయకుమార్,
బత్తుల సురేష్, నేరెళ్ళ రమేష్,
దీటి శ్రీనివాస్, ఈసుబ్,
మల్లెల రవిచంద్ర, సంతోష్ గౌడ్, చండ్రుగొండ మండల అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు దరా బాబు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, సీనియర్ జిల్లా నాయకులు మేడ మోహన్ రావు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తిబాబు, పవన్ బాబు,
చల్ల భాస్కర, మాజీ కౌన్సిలర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !