మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండల పరిధిలోని పోలారం గ్రామపంచాయితీ కి చెందిన పన్నెండు కుటుంబాలు న్యూడెమోక్రసీ పార్టీ నుంచి గురువారం బిఅర్ఎస్ లో చేరారు.వారు గత 35 సంవత్సారాలుగా న్యూడెమోక్రసి లో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లోని బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నాటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే హరిప్రియ పార్టీలో చేరిన వారిని కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శీలం రమేష్, ప్రధాన కార్యదర్శి కంభంపాటి రేణుక, వైస్ ఎంపీపీ ప్రమోద్, కో ఆప్షన్ మేంబర్ ఘాజి మహిళా నాయకురాలు అజ్మీర కవిత, మల్సుర్, లస్కర్ తదితరులు పాల్గొన్నారు