సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్యాంపు స్థలంలో పాకలు వేసిన వరద బాధితులు
*గుడిసెలను తొలగించిన పోలీసు బలగాలు
*మాకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి: వరద బాధితులు
మన్యం న్యూస్ చర్ల: చర్ల మండల కేంద్రంలో గత వారం రోజులుగా వరద ముంపు గ్రామస్తులు తమ ఇంటి స్థలాకై చేస్తున్న పోరాటం గురువారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. గోదావరి వరద ముంపు గ్రామస్తులు సర్వేనెంబర్ 117 గల ప్రభుత్వ భూమిలో పాకలు వేసుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న చర్ల సీఐ లు బి. రాజ్ గోపాల్, బొడ్డు అశోక్ , పోలీస్, సిఆర్పిఎఫ్ బలగాలు సంఘటన స్థలానికి చేరుకోనివరద బాధితులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు ఈ భూమిని సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కు కేటాయించడం జరిగింది. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ముంపు గ్రామస్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని అట్టి ప్రభుత్వ స్థలంలో పాకలు వేయించటం జరిగిందని తెలిపారు. ఈ స్థలం ప్రభుత్వం తమ క్యాంపుకు కేటాయించిందని, ఇక్కడ పాకలు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, వెంటనే వరద బాధితులు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగాపోలీస్ వారు హెచ్చరించారు. వారి హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా తమ గ్రామాలు ప్రతి సంవత్సరం గోదావరి వరదలకు ముంపుకి గురవుతుందని ఎన్నిసార్లు శాశ్వత పరిష్కారం చూపండి అని మెరక ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించండి అని ప్రభుత్వాన్ని వేడుకున్న పట్టించుకున్న ప్రభుత్వం లేదని ఇక్కడ వేసిన పాకలు పీకే సమస్య లేదంటూ బిస్మించి కూర్చున్నారు.వరద బాధితులు పాకలు వేసుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు వరద బాధితులకు కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది.అనంతరం వరద బాధితులకు పోలీసులకు మధ్య జరిగిన చర్చలు సఫలం అవడంతో సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు కొండ చరణ్, ముంపు బాధిత కుటుంబాలు,తదితరులు పాల్గొన్నారు.