మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కరకగూడెం, సీతారామపురం గ్రామాలలోని డెంగ్యూ పాజిటివ్ ఉన్న ఇండ్లలో ఫైరెత్రమ్ పిచికారి చేయడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ కారం.మధు అన్నారు. అనంతరం గ్రామాలలోని ప్రతి ఇల్లు తిరుగుతూ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సలహాలు ఇస్తూ అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. దోమల లార్వా ఉన్న ప్రాంతాలను తొలగించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊకె. రామనాథం ఉపసర్పంచ్ రావుల. రవి, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ అరుణ్ బాబు, గ్రామస్తులు బైరశెట్టి చిరంజీవి,బుడగం. రాము,ఎఎన్ఎం పద్మ, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
