సింగరేణి కార్మికులకు కార్పొరేట్ వైద్య సేవలు
* సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ బలరాం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
సింగరేణి కార్మికులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నామని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ బలరాం అన్నారు. గురువారం సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు సిటి ఎంఆర్‌ఐ బ్లాక్ బిల్డింగ్ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ బలరామ్ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశం తో సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు సిటి ఎంఆర్‌ఐ స్కాన్ ఏర్పాటు చేస్తున్నావని తెలిపారు. సింగరేణి సంస్థ కార్మికుల ఉద్యోగుల సంక్షేమం విషయములో ముందు వరుసలో ఉంటుందని కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు సింగరేణి ప్రధాన ఆసుపత్రి సహా అన్ని ఏరియా ఆసుపత్రులను ఆధుననీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో సిఎంఓ డాక్టర్ బి.వి.రావు, జియం సివిల్ సూర్యనారయణ, జి.ఎం సెక్యూరిటీ బి.ఆర్.దీక్షితులు, ఏసిఎంఓ పి.సుజాత, ఏసిఎంఓ విక్టర్ వందనం, ఎస్‌ఓ టు డైరక్టర్(పా) వరప్రసాద్, డిజిఎం(సివిల్) పి.రాజశేఖర్, డిజిఎం(ఈ అండ్ఎం) మెయిన్ వర్క్ షాప్ రాజీవ్ కుమార్, డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు.