దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
* రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
దివ్యాంగుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని దీనిలో భాగంగా పెన్షన్లు సైతం పెంచడం జరిగిందని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గురువారు ఐడిఓసి కార్యాలయపు సమావేశపుహాలులో నిర్వహించిన జూనియర్
పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, కారుణ్య నియామకాలు, జిఓ నెం.58 క్రింద ఇంటి స్థలాలు క్రమబద్దీకరణ
పట్టాలు పంపిణి, ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఇంటి పట్టాలు పంపిణి, దివ్యాంగులకు 3016 నుండి 4016 లకు పెంచిన మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 13770 మంది దివ్యాంగులకు పెంచిన పించన్లు ద్వారా లబ్దిపొందుతున్నారని చెప్పారు.
కరోనా విలయతాండవంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికి ఆసరా కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా ఆర్థిక సాయం
అందించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 10 వేల కోట్ల రూపాయలు ఆసరా పించన్లు చెల్లిస్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో దివ్యాంగులకు, వయోవృద్ధులకు, ఒంటరి మహిళలకు, కల్లుగీత కార్మికులకు, బోదకాలు భాదితులకు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పించన్లు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు
పథకం ద్వారా రైతులకు ఈ సంవత్సరం 72 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రుణమాఫీలో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల కోట్లరూపాయలు మాఫీ చేసినట్లు చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల క్రింద 12 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో 7778 మెగావాట్ల సామర్థ్యం
ఉన్న విద్యుత్ను రాష్ట్ర ఏర్పాటు తదుపరి 18 వేల మెగావాట్లకు పెంచి వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలు
ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
పేదరికంలో అట్టుడుగున్న ఎస్సిల అభివృద్ధికి దళితబంధు పథకాన్ని చేపట్టామని మొదటి విడతలో 421 మంది లబ్దిదారులకు, రెండో విడతలో నియోజకవర్గానికి 1100 మందికి
ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. బిసిలు ఆర్థికాభివృద్ధికి తిరిగి చెల్లించాల్సిన
అవసరం లేకుండా నియోజకవర్గానికి 300 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
చిత్తశుద్ధితో పట్టాలు పంపిణీ: కలెక్టర్
అర్హులైన వారందరికీ చిత్తశుద్ధితో పట్టాలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. జిఓ నెం.58 ద్వారా ఎంపిక చేసిన 154 మందిలో 15 మందికి క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేశామని మిగిలిన 139 పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఎస్సీలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విచారణ నిర్వహించామని వారిలో 37 మందికి క్రమబద్దీకరణ పట్టాలు
జారీ చేస్తున్నామని 968 మంది దరఖాస్తులు ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం, ఇల్లందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, హరిప్రియ, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు, జడ్పి వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు రాంబాబు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు తదితరులు పాల్గొన్నారు.