UPDATES  

 ఎమ్మెల్యేల మధ్య “ఢీ” అంటే “ఢీ”.

ఎమ్మెల్యేల మధ్య “ఢీ” అంటే “ఢీ”.

బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.

ఎమ్మెల్సీ తాత మధు సాక్షిగా వాగ్వివాదం.

గులాబీ వాసన పడని పోదెం.

170 మంది బీసీ కుల వృత్తి దారులకు చెక్కులు పంపిణీ.

అప్పుడు మళ్ళీ ఇప్పుడు.

మన్యం న్యూస్ పినపాక నియోజకవర్గం:- భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చర్ల,దుమ్ముగూడెం మండలాలకు చెందిన 170 మంది బీసీ కుల వృత్తి దారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సుమారు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటి 70 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అదికార యంత్రాంగం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు లు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడబోతున్న క్రమంలో రేగా చేతిలో మైక్ ని లాక్కొబోయి ఘర్షణకు దిగిన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ….దీంతో భద్రాచలంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇరువురు ఎమ్మెల్యేల ఘర్షణ నెలకొన్నది,బిసి బందు చెక్కుల పంపిణీ కార్యక్రమం రసభసగా కొనసాగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతిలో నుంచి మైక్ లాక్కోని వాగ్వివాదానికి దిగిన పొదేం వీరయ్య తీరుపై ఎమ్మెల్యే రేగాతో పాటు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తూ మండిపడ్డారు.దీంతో మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం పోటాపోటీగా ఆందోళనలకు దిగారు.ఈ బిసి బందు లబ్ధిదారుల ఎంపిక కేవలం బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నారనే నేను రేగా వద్ద నుండి మైక్ లక్కొడానికి కారణం అని పోదేం తెలపసాగారు.దీంతో ఇరు పార్టీల వర్గాల మధ్య రభస ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న పోలీసులు ఆపేందుకు ప్రయత్నం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పుకుంటూ గొడవను సద్దుమనుగు చేశారు.ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వాగ్వివాదాన్ని ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ తాతా మధు ఇరువురికి నచ్చచెప్పి ఆపేందుకు ప్రయత్నం చేసి రభస ఆపారు.అనంతరం చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు.
అప్పుడు…..ఇప్పుడు
గతంలో కొద్దిరోజుల క్రితం ఈ భద్రాచలం నియోజకవర్గం లోని దుమ్ముగూడెం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఇరువురు ఎమ్మెల్యేల మధ్య “ఢీ” అంటే “ఢీ” అనే విధంగా జరిగిన ఘర్షణ కుడా విధితమే….భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని లక్ష్మినగరంలో కొద్దిరోజుల క్రితం తునికిఆకుల సేకరణ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు,భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రేగా కాంతారావు సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.అయితే రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను పొగటంతో దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య రేగా పై ఫైర్ అయ్యారు,మా నియోజకవర్గంలో మా ముందు కేసీఆర్ ని పొగుడుతారా,పార్టీ పదం వాడతార అని రేగా కాంతారావును పోదెం వీరయ్య అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.అయితే ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం సమయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు.ఇక వేదికపైనే రేగా కాంతారావు,ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు.అయితే వెంటనే అక్కడున్నవారు,పోలీసులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఆ సమయంలో వైరల్‌గా మారాయి.ఈ గొడవ మనసులో పెట్టుకొని గురువారం భద్రాచలంలో మరోమారు ఢీ అంటే ఢీ అనే విధంగా గులాబీ వాసన పడని పోదెం వీరయ్య గొడవకు దిగారంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !