మన్యం న్యూస్,మణుగూరు:
చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్ భారత దేశ కీర్తి ప్రపంచంలో నలుమూలల వ్యాప్తి చెందిందని మండల బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానికంగా గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంతటి ఘన కీర్తి కి కారణం ఐన భారత శాస్త్రవేత్తలకు వారు కృతజ్ఞతలు తెలుపుతూహర్షo వ్యక్తం చేశారు.ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో మణుగూరు ఎం పి పి ల్ కారం. విజయకుమారి, బి ఆర్ యస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, ఎం పి టి సి లు గుడిపూడి. కోటేశ్వరరావు, మచ్చ. సమ్మక్క, కో ఆప్షన్ సభ్యులు జావీద్ పాషా, రైతు సమితి అధ్యక్షులు రామసాని. వెంకటరెడ్డి, వార్డ్ మెంబర్ బర్మవత్. నరసింహారావు మహిళా సంఘం అధ్యక్షురాలు పాకాల. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.