మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 24: తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా అశ్వారావుపేటకు చెందిన వేముల ప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం పట్టణంలో ఉన్న కాంగ్రెస్ డిసిసి కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత సేవాదళ్ జిల్లా అధ్యక్షులు అయిన అంగోతు నమోదు నాయక్ చేతులు మీదుగా అధికారిక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్ట కాలంలో పార్టీకి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన ఒక్కరిని పార్టీ గుర్తుంచుకొని పార్టీ పదవులు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుపెట్టుకుని వారికి అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో పక్క రాష్ట్రమైన కర్ణాటక మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన భావాన్ని వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వేముల ప్రతాప్ఎండి రహమద్ లు కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తామని అన్నారు.