గడపగడపకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు
-ఎమ్మెల్యే మెచ్చా
*వికలాంగుల పెన్షన్ ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే మెచ్చా
*నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి నెల 2724 మంది వికలాంగులకు 1కోటి 9లక్షలు రూపయల పెన్షన్
*64 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది ఇప్పటికే రూ.3016, వికలాంగులకు ఇస్తుండగా వారికి మరో 1000/- రూ పెంచింది. కాగా గురువారం అశ్వారావుపేట గిరిజన భవన్ లో లబ్ధిదారులకు ఉత్తర్వులను అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అందజేసారు. అలాగే ఎమ్మెల్యే మెచ్చా సిఫార్సుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 64 లక్షల రూపాయల విలువ చేసే 64 కళ్యాణ లక్ష్మి చెక్కులను అదే వేదికపై లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంనీ అభివృద్ధిలో ముందడుగు కెసిఆర్ పట్టుదల అని పెన్షన్ పెంచడమే కాక నిర్ణయం తీసుకున్న అతి కొద్ది రోజుల్లోనే అమలులోకి తీసుకొచ్చారని అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి నెల 2724 మంది వికలాంగులకు 1కోటి 9లక్షలు రూపయల పెన్షన్ అందుతుందని, దమ్మపేట మండలం 751 మందికి, అశ్వారావుపేట మండలం 752, ములకలపల్లి మండలం 439, అన్నపురెడ్డిపల్లి మండలం 260, చండ్రుగొండ మండలం 522 మంది పెన్సిల్దారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పాల్గొన్నారు.