గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్ తో సాధ్యమైంది
*పట్టుబట్టి పోడుడు పట్టాలు సాధించిన ఎమ్మెల్యే రేగాకు కృతజ్ఞతలు
* సర్పంచ్ ల సంఘం మణుగూరు మండల అధ్యక్షుడు ఏనిక ప్రసాద్ మన్యం న్యూస్ చిచ్ చాట్
మన్యం న్యూస్,మణుగూరు:
1. మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీల తీరు ఎలా ఉంది
సర్పంచ్: గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యమైంది. గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుబడ్డ పంచాయతీలు కేసీఆర్ విజయంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ప్రతి పంచాయతీకి చెత్త సేకరణకు ట్రాక్టర్ ఏర్పాటు చేయడం, సిబ్బందిని నియమించడం, సకాలంలో నిధులు విడుదల చేయడంతో ఆరోగ్యవంతమైన పంచాయితీలుగా రూపొందాయి .
2. పోడు భూములకు తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టాల మంజూరు పై మీ కామెంట్?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అడవినే నమ్ముకుని అడవిపై జీవనాధారం వెళ్లదీస్తున్న ఆదివాసి గిరిజనులకు పోడు భూములకు హక్కు పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పట్టు వదలని విక్రమార్కుడిలా అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి ఆదిలాబాద్ నుండి అశ్వరావుపేట వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి పోడుపట్టాలు రావడానికి చేసిన కృషి మరువలేనిది. పోడు పట్టాలతో పాటు వ్యవసాయం సాగుకు సైతం రైతుబంధు కేటాయించిన ముఖ్యమంత్రి కి ఆదివాసి గిరిజన పోడు సాగుదాలు ఋణపడి ఉంటాం.కూనవరం, వైఎస్సార్ నగర్, రేగుల గండి మూడు హెబిటేషన్లకు సంబంధించి 306 మంది పోడు సాగుదారులకు కోడ్ పట్టాలు రావడం జరిగింది.
3. మీ పంచాయతీలు బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం ఎలా కొనసాగుతుంది?
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో దాదాపుగా మొండి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన ఎమ్మెల్యే రేగా కాంతరావు కూనవరం పాఠశాల నుండి రేగుల గండి వరకు ఒక కోటి 80 లక్షల నిధులను బీటీ రోడ్డు నిర్మాణానికి కేటాయించడం జరిగింది. కూనవరం పంచాయతీలో దాదాపుగా ప్రతి సందులో సీపీ రోడ్లు వేయడం జరిగింది.
4. మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణం పూర్తయిందా.
కూనవరం పంచాయతీకి గతంలో 400 ఇల్లుకవర్ అయ్యేలా మిషన్ భగీరథ పైప్ లైన్ మంజూరు కావడం జరిగింది. కానీ ఇదే పైప్లైన్ తో కూనవరం పంచాయతీలో త్రాగునీటి సమస్య జటిలం కానుందని గ్రహించి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మరికొంత మిషన్ భగీరథ లైన్ కావాలని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా 1200 ఇళ్ల కు మిషన్ భగీరథ సురక్షిత త్రాగునీటి సౌకర్యంకొరకు అధికారులచే రీ సర్వే జరిపించి 9 కిలోమీటర్ల భగీరథ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. కూనవరం గ్రామపంచాయతీ త్రాగునీటి కష్టాలు తీరాయి.
5. కోడిపుంజుల వాగుపై వంతెన నిర్మాణం.
కూనవరం మీదుగా కోడిపుంజుల వాగు ప్రవహిస్తుంది.వర్షాకాలంలో కూనవరం, ఇతర ప్రాంతాల ప్రజలు గతంలో ఉన్న ఇరుకు వంతెన పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సిందే. సింగరేణి సంస్థకు విజ్ఞప్తి చేయగా సింగరేణి ఆధ్వర్యంలో నూతన వంతెన నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రజల కష్టాలు తొలగాయి.
6. సీఎం కేసీఆర్ పాలనపై మీ కామెంట్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ప్రపంచంలోనే ఆదర్శవంతమైన పాలన. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం వనగూరే విధంగా సంక్షేమ పాలన రాష్ట్రంలో నడుస్తుంది. కెసిఆర్ పంచాయతీలను సైతం చిన్న పంచాయతీలుగా మార్పు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిన తెలియదు తీసుకుంటున్నారు. కెసిఆర్ సంక్షేమం అందని గడప లేదంటే అతిశక్తి కాదు. సీఎం కేసీఆర్ సంక్షేమం గ్రామాలపై చెరగని ముద్ర వేసింది.
7. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మీ కామెంట్స్
నేటి స్మార్ట్ కాలంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రాజకీయ పరిజ్ఞానం నేటి నాలాంటి యువతరానికి ఆదర్శం. ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసి బిడ్డ నేటి రాజకీయాలను తట్టుకుంటూ రాజకీయ చాణిక్యుడు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ మదిని గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎమ్మెల్యే రేగాను స్ఫూర్తిగా తీసుకొని పంచాయతీ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తా అన్నారు.
8. గ్రామాలలో పరిశుద్ధం ఎలా ఉంది?
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యల మూలంగా గ్రామాలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ప్రజా ప్రతినిధులతో పాటు, అధికారులు బాధ్యతగా తీసుకోవడంతో గ్రామాలలో గతంలో పోలిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. గ్రామాలలో వైద్య సిబ్బంది సేవలు సకాలంలో అందుతున్నాయి.
