100 పడకల ఏరియా ఆసుపత్రి ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
*మణుగూరు ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు
*విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్,మణుగూరు:100 పడకల ఏరియా ఆసుపత్రి ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు. తాను మొదటి సారి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో ఎంతో శ్రమకూర్చి మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని, అనంతర కాలంలో తాజా మాజీ ఎమ్మెల్యే దాని వైపు చూసిన పాపాన పోలేదని అన్నారు. ప్రజలు మరోమారు అవకాశం ఇవ్వడంతో ఏరియా ఆసుపత్రి పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు అనేక మంది రోగులకు ఎరుగైన వైద్యం అందుతుందన్నారు. ఆస్పత్రిలో రోగుల అవసరాల కొరకు వివిధ రకాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.మణుగూరు ఏరియా ఆస్పత్రి ని అత్యుత్తమ ఏరియా ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు.
